భీమదేవరపల్లి: జులై 24న పీవీ స్మృతివనం ప్రారంభం...హాజరుకానున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

భీమదేవరపల్లి: జులై 24న పీవీ స్మృతివనం ప్రారంభం...హాజరుకానున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో నిర్మించిన పీవీ స్మృతి వనాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్​చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. దివంగత ప్రధాని పీవీకి నివాళిగా బీఆర్ ఎస్ హయాంలో పనులు మొదలు కాగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్​ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి, పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. 

ప్రధానిగా పీవీ చేసిన సంస్కరణలు, ప్రత్యేకతలు వివరించేలా ఫొటో గ్యాలరీ, ఓపెన్​యాంపీ థియేటర్, మెడిటేషన్​సెంటర్, మ్యూజియంతో పాటు అంతర్గత రోడ్లు, వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మొక్కలతో గార్డెన్ ను ఆకర్షణీయంగా రూపుదిద్దారు. వంగర గ్రామానికి వచ్చేందుకు డబుల్​రోడ్డు నిర్మాణంతో పాటు ఇరువైపులా మొక్కల పెంపకం చేపట్టారు.