
హైదరాబాద్, వెలుగు: ప్రైమ్‌వాలీబాల్‌లీగ్(పీవీఎల్) నాలుగో సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 2 నుంచి గచ్చిబౌలిలో ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది. ఆతిథ్య జట్టుగా బరిలోకి దిగుతున్న హైదరాబాద్‌బ్లాక్‌హాక్స్ ( హెచ్‌బీహెచ్) ఆరంభ మ్యాచ్‌లో కాలికట్ హీరోస్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్హ్యాక్స్మ్యాచ్లు చూసేందుకు రావాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టీమ్ ఓనర్ కంకణాల అభిషేక్ రెడ్డి ఆహ్వానించారు. సోమవారం ముగ్గురినీ కలిసి వాళ్ల పేర్లతో ప్రత్యేకంగా రూపొందించిన బ్లాక్ హాక్స్ టీమ్ జెర్సీలను అందజేశారు.