
న్యూఢిల్లీ: కరోనా సేకండ్ వేవ్‌ను అడ్డుకోవడానికి త్వరితగతిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ను వెంటనే అడ్డుకుందామని మోడీ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన మీటింగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని 70 జిల్లాల్లో గత కొన్ని వారాల్లో కరోనా కేసుల్లో 150 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా సెకండ్ వేవ్‌ను మనం వెంటనే అడ్డుకొని తీరాలి. అందుకు అవసరమైన చర్యలను శీఘ్రగతిన తీసుకోవాలి’ అని సీఎంలకు మోడీ సూచించారు.