పాలమూరు- రంగారెడ్డితో సస్యశ్యామలం చేస్తం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పాలమూరు- రంగారెడ్డితో సస్యశ్యామలం చేస్తం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగా రెడ్డి, వెలుగు: కాళేశ్వరం మాదిరిగా పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి  చేస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుందని చెప్పారు. బుధవారం మహేశ్వరంలోని ఫంక్షన్​హాల్‌లో జిల్లా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగు నీటి దినోత్సవం నిర్వహించారు.

మంత్రి సబితారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో, కుంటల్లో పూడిక తీయించి నీటి నిల్వ సామర్థ్యం పెంచామని చెప్పారు. మండు వేసవిలోనూ చెరువులు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, ఎంపీపీ రఘుమారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.