ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం : ఆర్. కృష్ణయ్య

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో   బీసీ, ఎస్సీ, ఎస్టీ  విద్యార్థులకు అన్యాయం : ఆర్. కృష్ణయ్య
  • పాత జీవో 550 ప్రకారమే అడ్మిషన్లు చేపట్టాలి: ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ విధానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నష్టం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. 

శనివారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేశారు. గత 24 ఏళ్లుగా అమలవుతున్న జీవో 550 స్థానంలో కొత్త జీవో 114 తేవడం వల్ల సుమారు 300 నుంచి 400 మంది రిజర్వుడ్ వర్గాల విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ చదువు దూరం కాకుండా పాత జీవో ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.