స్టూడెంట్స్ ర్యాగింగ్ జోలికి వెళ్లొద్దు

స్టూడెంట్స్ ర్యాగింగ్ జోలికి వెళ్లొద్దు
  • డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. రాచకొండ సీపీ చౌహాన్  

ఘట్‌కేసర్, వెలుగు:  స్టూడెంట్స్​  ర్యాగిం గ్  జోలికి వెళ్లొద్దని, డ్రగ్స్ కు ఆకర్షితులు కావొద్దని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సూచించారు.  భవిష్యత్ కు  మంచిదారిని నిర్మించుకునేందుకు కాలేజీ లైఫ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఘట్‌కేసర్‌ లోని అనురాగ్ వర్సిటీలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ పై శుక్రవారం నిర్వహించిన ప్రోగ్రామ్ కు ఆయన హాజరై మాట్లాడారు.  సీనియర్లు తమ జూనియర్లను ఫ్రెండ్స్ గా భావించాలని తెలిపారు. 

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ యాంటీ డ్రగ్ క్లబ్‌లకు దిశా నిర్దేశం చేశారు. సుమారు 2 వేల మంది విద్యార్థుల చేత ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ ప్రమాణం చేయించారు.  ర్యాగింగ్ వంటి హీనమైన చర్యలకు దూరంగా ఉండాలని, తమ ఫ్యూచర్‌‌ నిర్మాణానికి కాలేజీని సద్వినియోగం చేసుకోవాలని, డ్రగ్స్‌ దూరంగా ఉండి, తమ దృష్టి కెరీర్ మీద ఉంచాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో డీసీపీ మల్కాజిగిరి జానకి ఐపీఎస్, మల్కాజిగిరి ఏసీపీ నరేశ్​రెడ్డి, కాలేజ్ సీఈఓ, రిజిస్ట్రార్‌, హెచ్‌ఓడీలు,  విద్యార్థులు ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.