ఐపీఎల్‌కు టైట్ సెక్యూరిటీ

ఐపీఎల్‌కు టైట్ సెక్యూరిటీ

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోజరిగే ఐపీఎల్ మ్యాచ్‌ లకు రాచకొండ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్చి 29నుంచి ఏప్రిల్ 29 వరకు జరుగనున్న 7 మ్యాచ్లకు 2300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓ వైపు లోక్సభ ఎన్నికలు మరోవైపు ఐపీఎల్ నేపధ్యంలో తీసుకున్న భద్రతా ఏర్పాట్లను మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువారం వెల్లడించారు.

నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు

ఉప్పల్ స్టేడియంలో నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటుజరిగే 7 మ్యాచ్ ల్లో ఎలాంటి అవాంఛనీయఘటనలు చోటు చేసుకోకుండా రాచకొండపోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.38000 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం-లో రెండు యూనిట్ ల ఆక్టోపస్ తో పాటు 2300మంది పోలీసులు, 300 సీసీ కెమెరాలతో నిఘాపెట్టారు. ఇందులో 4 ప్లాటూన్ల రాష్ట్ర స్పెషల్ పార్టీపోలీసులు, మౌంటెడ్ పోలీసులు, రోప్ పార్టీలు,ఆర్మ్డ్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు.ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలుగకుండా225 మంది ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ విధులునిర్వహిస్తారు. లా అండ్ ఆర్డర్,ట్రాఫిక్ పోలీసులేకాకుండా స్పెషల్ ఆపరేషన్ టీమ్స్,సీసీఎస్,మ-హిళా భద్రత కోసం షీ టీమ్స్ పనిచేయనున్నాను .స్టేడియం పరిసర ప్రాంతాలను పూర్తిగా తమఆధీనంలోకి తీసుకుని 300 సీసీ కెమెరాలతోనిఘా పెట్టారు.

సెకన్ టు సెకన్ చెక్

ఇప్పటికే స్టేడియం మొత్తం తమ కస్టడీలోకితీసుకొని అణువణువు చెక్ చేశారు. స్టేడియంలోపల, బయట అన్ని ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్పాయింట్స్, పార్కిం గ్ ప్లేసుల్లో సీసీ కెమెరాలుఏర్పాటు చేశారు. వాటిని కమాండ్ కంట్రోల్రూమ్ తో కనెక్ట్ చేశారు. వీటిని ప్రతీ క్షణంగమనించేం దుకు ఇన్ స్పెక్టర్ స్థా యి అధికారి-తో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ పనిచేస్తుంది.అందుకోసం జీ-6 బాక్స్ వద్ద ప్రత్యేక మానిటర్ఏర్పాటు చేశారు.

క్రికెటర్లు, వీఐపీలకు స్పెషల్​ సెక్యూరిటీ

క్రికెటర్లు, వీవీఐపీలు,వీఐపీలకు సిటీ సెక్యూరిటీవింగ్ వెహికిల్ తో పాటు లా అండ్ పోలీసులుఎస్కార్ట్ ఇస్తారు. ఇందులో ట్రాఫిక్ క్లియర్చేయడం కోసం స్పెషల్ రూట్ క్లియర్ పార్టీలనుఏర్పాటు చేశారు.సంఘ విద్రోహ శక్తులపై ప్రత్యేకనిఘా పెట్టారు. అందుకోసం 4 మొబైల్ టెక్నికల్టీమ్ లు సిద్ధం చేశారు. ఆడిటోరియం పరిసరప్రాంతాలు మొత్తం ఆక్టోపస్, ఎన్జీఎస్ ఆధీనంలోఉంటాయి. అందులోకి అధికారిక పాసులు ఉన్నవారిని తప్ప ఇతరులను అనుమతించరు. దీంతోపాటు వీఐపీ లాంజ్ లో కూడా ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్తెలిపారు. నిషేధిత వస్తువులను స్టేడియంలోకిఅనుమతించబోమని సీపీ చెప్పారు.

స్టేడియంలోకి సెల్ ఫోన్స్ తేవచ్చు

స్టేడియంలోకి మొబైల్ ఫోన్లు, ఇయర్ ఫోన్స్తప్ప ఎలాంటి ఎలక్ట్రాని క్ వస్తువులను అనుమ-తించబోమని సీపీ మహేశ్ భగవత్ వెల్లడిం చా-రు. ఇందుకోసం 4 మొబైల్ టీమ్ లను ఏర్పాటుచేశామన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్,యాంటీ ఈవ్ టీజింగ్ టీమ్స్ ఏర్పాటు చేశా-మన్నారు. ఈ టీమ్స్ తో పాటు మఫ్టీ పోలీసులుపోకిరీలపై నిఘా పెడతాయన్నారు. దీంతో పాటుతిను బండారాలను నిర్ణీత ధరల్లోనే అమ్మేందుకుచర్యలు తీసుకున్నామని చెప్పారు. గేట్ నంబర్1,3,4,7,8 వద్ద మౌంటెడ్ పోలీసులతో బందోబ-స్త్ ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియంలోకిఉదయం 11.30గంటలకు అనుమతిస్తామనిచెప్పారు. వాహనదారులు నిర్దేశించిన ప్రాం-తాల్లో మాత్రమే వెహికిల్ పార్క్ చేయాలని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు.

మ్యాచ్ ముందు డిసైడ్ అవుతాం

కేన్ విలియమ్సన్ పై మ్యాచ్​కు ముందునిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి అతను కోలుకున్నట్టే కనిపిస్తున్నాడు.అతను తుది జట్టులోకి వస్తాడా? ఓపెనింగ్ కాంబినేషన్ ను మార్చాలో వద్దో అనేదానిపై కూడా శుక్రవారమే డిసైడ్ అవుతాం. గత మ్యాచ్​లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. చివరి మూడు ఓవర్లలోనే పరిస్థితి తలకిందులైంది. కొనిసార్లు ఇలా జరగడం సహజం. మ్యాచ్ పూర్తయ్యే వరకూ మన ప్లాన్స్ ను పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది. ఒక్క ఓవర్ లో ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నాడని భువనేశ్వర్ పై ఒక అభిప్రాయానికి రావడం సరికాదు. అతనిపై మాకు పూర్తి భరోసా ఉంది. మిడిలార్డర్ ఆటగాళ్లపై కూడా నమ్మకంగా ఉన్నాం. ­­­__ టామ్ మూడీ, సన్ రైజర్స్ హెడ్ కోచ్

మన్కడింగ్ మరిచిపోయాం

గత మ్యాచ్​లో జరిగిన మన్కడింగ్ గురించి మేం అప్పుడే మర్చిపోయాం. జరిగిందేదో జరిగిపోయిం ది. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా దృష్టి మొత్తం సన్ రైజర్స్ తో పోరు పైనే ఉంచాం.ఈ మ్యాచ్​లో గెలిచేందుకు బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. పంజాబ్​పై జోస్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే, అతను ఒక్కడే ఆడితే సరిపోదు. మిగతా వాళ్లు కూడా బాధ్యత తీసుకుంటేనే విజయం సాధ్యమవుతుంది.__ జయ్ దేవ్​ ఉనాద్కట్, రాజస్థా న్ బౌలర్