ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల ఫలితాలపై రాహుల్ అభినందించారు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల ఫలితాలపై రాహుల్ అభినందించారు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమను అభినందించారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 19) ఢిల్లీలో హైకమాండ్ ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రులందరితో తమ పార్టీ అగ్రనాయకులు సమావేశమయ్యారని తెలిపారు.

మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని ఈ సందర్భంగా మహేష్ గౌడ్ చెప్పారు. రాజ్యసభ అభ్యర్థులపై రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం హైకమాండ్ దగ్గర చర్చకు వచ్చినట్లు చెప్పారు. రాజగోపాల్ రెడ్డితో త్వరలోనే పార్టీ మాట్లాడుతుందని అన్నారు.  ప్రజలు సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టే.. పార్టీని ఆశీర్వదించారని పేర్కొన్నారు.