
హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్ నేతృత్వంలో గాంధీభవన్‌లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో స్టూడెంట్, యూత్ లీడర్లంతా రక్తదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటళ్లు, అనాథ ఆశ్రమాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. రాహుల్ క్షేమంగా ఉండాలని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో పూజలు చేయించామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణు, కోదండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.