V6 News

అభివృద్ధి ముసుగులో విధ్వంసం.. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం: రాహుల్ ఫైర్

అభివృద్ధి ముసుగులో విధ్వంసం.. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం:  రాహుల్ ఫైర్

గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో 81వేలకోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మౌళిక సదుపాయాల కల్పన ప్రాజెక్టును ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. పర్యావరణ వ్యవస్థ, ఆదివాసీలపై ప్రత్యక్ష దాడి అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆర్థిక ప్రయోజనాలకంటే పర్యావరణ వ్యవస్థ, ఆదివాసీ గిరిజనులకు తీరని నష్టమని అన్నారు. లక్షలకోట్ల కలప సంపదను దోచుకునేందుకు కుట్ర అని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి ముసుగులో విధ్వంసం తప్ప మరేమీ కాదని అన్నారు.

గ్రేట్ నికోబార్ దీవుల్లో  కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ప్రాజెక్టు కాదని..దేశానికి భారీ వర్షపాతాన్ని అందించే అతిపెద్ద అడవుల నరికివేత అని దాదాపు 160 చదలరపు కిలోమీటర్ల వర్షారణ్యాన్ని నాశనం చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. తరతరాలుగా పోషించబడిన అడవులు,ఆ ద్వీపంలో నివసిస్తున్న  అందమైన ప్రజలు  తమకు చట్టబద్ధంగా చెందాల్సిన హక్కులను కోల్పోతున్నారు అని అన్నారు రాహుల్.

ఇటీవల గ్రేట్ నికోబార్ దీవుల్లో  పర్యటించిన రాహుల్ గాంధీ.. అక్కడి అడవుల్లో నిలబడి మాట్లాడుతూ ఓ వీడియోను  సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో.. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఓ పెద్ద కుంభకోణం.. దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం.. అత్యధిక వర్షపాతాన్నిచ్చే అడవులను నరికేందుకు సిద్దమవుతున్నారు.. డానీ అనే వ్యాపార వేత్త ఈ ప్రాజెక్టుతో లక్షలకోట్ల  కలపను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.డానీ ప్రాజెక్టుతో ఇండియన్ ఎకోలాజికల్ ప్రాపర్టీ  ధ్వంసం అవుతుంది.. దేశ యువత దీనిని కాపాడుకోవాలి  అంటూ వీడియో మేసేజ్ చేశారు. 

ట్రాన్స్ షిప్ మెంట్, లాజిస్టిక్స్ హబ్ ను నిర్మించాలని రూ.81వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం గ్రేట్ నికోబార్ దీవుల్లో ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే గతంలో  సోనియా గాంధీ కూడా ఈ ప్రాజెక్టు తీవ్రంగా విమర్శించారు. ఈ దీవుల్లో గొప్ప జీవ వైవిధ్యం ఉందని, స్థానికంగా గిరిజన తెగలున్నాయని ఈ ప్రాజెక్టుపై పున పరిశీలించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. 

మరోవైపు ఈ ద్వీపంలో మౌళిక సదుపాయాల ప్రాజెక్టుపై భిన్న వాదనలు ఉన్నాయి.  భౌగోళిక, రాజకీయంగా వ్యూహాత్మకమైన మలక్కా జలసంధికి ఎదురుగా ఉన్న ఈ ద్వీపం కీలకమైంది. హిందూ మహాసముద్రంలో బీజింగ్ 'స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్' వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు భౌగోళిక రాజకీయంగా కూడా ఈ ద్వీపంగా ముఖ్యమైనది. అయితే హాంగ్ కాంగ్ చైనాకు చేసినట్లే, ఈ ప్రాజెక్ట్ కూడా ఆదాయం తీసుకొస్తుందని, సముద్ర శక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు.