బీజేపీ పాలనలో కొందరే రిచ్ అవుతున్నరు

బీజేపీ పాలనలో కొందరే రిచ్ అవుతున్నరు

మోడీ సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

టుటికోరిన్/ తిరువనల్వేలి (తమిళనాడు): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వెల్త్ డిస్ట్రిబ్యూషన్ లో అసమానత బలంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో కొందరు మాత్రమే ధనికులవుతున్నారని, పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారని అన్నారు. ఆదివారం రెండోరోజు తమిళనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టుటికోరిన్ లో సాల్ట్ వర్కర్లతో మాట్లాడి వాళ్ల కష్టాలను తెలుసుకున్నారు. ఏడాదిలో నాలుగు నెలలు తమకు పని ఉండదని, ప్రభుత్వం సాయం అందించాలని ఓ మహిళా వర్కర్ చెప్పింది. లిక్కర్​వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతు న్నాయని, పూర్తిగా లిక్కర్ బ్యాన్ చేయాలని మరికొందరు మహిళా వర్కర్లు కోరారు. మెరుగైన కూలీ, వెల్ఫేర్ బోర్డు, పెన్షన్, జీవన ప్రమాణాలు పెంచాలన్నారు. ఉప్పు పొలాల్లో పని చేయటం వల్ల తమకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి పేద కుటుంబానికి మినిమమ్ ఇన్ కమ్ అందించేందుకు న్యాయ్ స్కీమ్ ను ప్రకటించామని గుర్తు చేశారు. ఏ ప్రాంతం వారైనా సరే ప్రతి కుటుంబం ఏడాదికి రూ.72 వేలు అందుకునేలా ఈ స్కీమ్ ను రూపొందించామన్నారు.  కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ స్కీమ్ ను అమలు చేస్తామని రాహుల్​  హామీ ఇచ్చారు.

ప్రజలు మద్దతిస్తే మోడీని సాగనంపుతం

ప్రధాని మోడీ భయంకరమైన శత్రువని, ప్రత్యర్థులను దారుణంగా అణచివేస్తారని.. అహింస, ప్రేమ ద్వారా ఆయనను ఓడిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీని ఓడించేందుకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.  ఆదివారం తిరువనల్వేలిలోని సెయింట్ జేవియర్ కాలేజ్ లో ‘ఎడ్యుకేటర్స్ మీట్’ లో స్టూడెంట్స్ తో రాహుల్ ఇంటరాక్ట్  అయ్యారు. ‘ధనబలం ఉన్న, ప్రత్యర్థులను అణచివేసే శత్రువుతో పోరాడుతున్నాం. గతంలోనూ పోరాడాం. మోడీ కన్నా బలంగా ఉండే బ్రిటీష్ సామ్రాజ్యంపై పోరాడాం. బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమేశాం. మోడీని కూడా నాగ్ పూర్ కు తరిమేస్తాం’అని అన్నారు.