భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణం రాహూల్‌గాంధీ నగర్లో 20 రోజులుగా నీళ్లు రావడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పైప్లైన్లు పగిలి నీళ్లన్నీ వృథాగా పోతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తాగునీటితో పాటు ఇంటి అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్ స్పందించి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు.
