- డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత
- ఉపాధి హామీ ప్రోగ్రామ్‌లో పాల్గొని కూలీలతో ముచ్చటించనున్న రాహుల్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెల 2న వికారాబాద్‌కు రానున్నారు. అనంతగిరి హిల్స్ లో జరుగుతున్న తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారు. అంతకుముందు పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని ఓ పల్లెలో ఉపాధి హామీ పథకం కూలీలతో కలిసి ముచ్చటించనున్నారు. రాహుల్ రాష్ట్ర పర్యటనపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు ఏఐసీసీ హెడ్ క్వార్టర్ నుంచి మంగళవారం సమాచారం అందింది. అయితే మినట్ టు మినట్అధికారిక షెడ్యూల్ రావాల్సి ఉంది. రాహుల్ ప్రోగ్రామ్ నేపథ్యంలో మహేశ్ గౌడ్ మంగళవారం పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాలను సందర్శించారు. ఉపాధి పథకం పనులు ఏ గ్రామంలో జరుగుతున్నాయి.. రాహుల్ ను ఎక్కడికి తీసుకెళ్లాలనే దానిపై స్థానిక ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డితో చర్చించారు.
