హాలీవుడ్ లో రాహుల్ రామకృష్ణ

హాలీవుడ్ లో రాహుల్ రామకృష్ణ

అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకు ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఇప్పటికే తెలంగాణ స్లాంగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రామకృష్ణ.. ‘సిల్క్ రోడ్’ అనే ఇంగ్లీష్ చిత్రాన్ని చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రాహుల్ హీరోగా చేయనున్నారు. ఈ సినిమాకు ప్రదీప్ కటసాని దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్వవహరిస్తున్నాడు.

“నేను ఊహించినదానికంటే ఎక్కువగా ఈ విషయం బయటకు వచ్చింది. ఇన్ని రోజులుగా నేను ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చేసాను. హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాం.. మా కష్టానికి తగ్గ ఫలం దక్కుతుందని ఆశిస్తున్నా” అని రాహుల్ ట్వీట్ చేశాడు.