
- రేపట్నుంచి నుంచి సోమవారం వరకు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శని, ఆది, సోమవారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 6.45 సెంటీమీటర్ల నుంచి 11.55 సెంటీ మీటర్ల వరకు వర్షం కురవవచ్చని స్పష్టం చేసింది. శుక్రవారం తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది.
కాగా, గురువారం నగరంలోని పలుప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా కాప్రాలో 3.75, మల్లాపూర్ లో 3.73, నేరెడ్ మెట్ లో 3.38, ఉప్పల్ లో 2.95, మౌలాలిలో 2.63 సెంటీ మీటర్ల వర్షం పడింది.