హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..రోడ్లన్నీ జలమయం..నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..రోడ్లన్నీ జలమయం..నిలిచిపోయిన వాహనాలు

 హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి,మణికొండ, లింగంపల్లి,కూకట్ పల్లి,  అమీర్ పేట,పంజాగుట్ట, ఖైరతాబాద్,లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్,బషీర్ బాగ్, నారాయణ గూడలో భారీ వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. 

 హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఎల్బీనగర్, బోడుప్పల్, నాగోల్,హయత్ నగర్, నాగారం, అల్వాల్, బోయినపల్లి, సికింద్రాబాద్,  అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్ పేట, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, బండ్లగూడ జాగర్, కిస్మత్ పూర్ , హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్, నార్సింగి,   పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట్  తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.  దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

భారీ వర్షం పడుతుండడంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరుతోంది. ద్విచక్ర వాహనాలు మెట్రో స్టేషన్లు, బ్రిడ్జీలు, షటర్ల కింద తలదాచుకుంటున్నారు. వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు జామ్ అవ్వకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం వస్తుండటంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయల్దేరాలని సూచించారు.  మరో వైపు తెలంగాణకు మూడు  రోజులు పాటు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ.