హైదరాబాద్ లో వర్షం.. వీకెండ్ కూల్ వెదర్

హైదరాబాద్ లో వర్షం.. వీకెండ్ కూల్ వెదర్

వాతావరణ శాఖ హెచ్చరించినట్లే.. హైదరాబాద్ లో వర్షం పడుతుంది. ఆగస్ట్ 25, 26 తేదీల్లో ఉరుములు, మెరుపులతో వర్ష సూచన ఉన్నట్లు ముందే ప్రకటించింది. అనుకున్నట్లుగానే 2023, ఆగస్ట్ 26వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఉక్కబోత, ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతంగా మారింది. మోస్తరు వర్షం పడుతుంది. 

హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నల్లగండ్ల, గచ్చిబౌలి, మదాపూర్, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది. 10 రోజులుగా హైదరాబాద్ సిటీలో వర్షం లేదు. ఇప్పుడు మళ్లీ వర్షం మొదలైంది. మోస్తరు వర్షంతోపాటు కూల్ వెదర్ ను.. వీకెండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు జనం.