హైదరాబాద్ : క్యుములో నింబస్ మేఘాల ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, సరూర్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్, చాంద్రాయణ్ గుట్ట ఏరియాల్లో తేలిక పాటి వర్షాలు పడుతున్నాయి. సిటీలో చాలా చోట్ల వర్షం పడుతోంది. మల్కాజిగిరి, నేరెడ్ మెట్, మౌలాలి, కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి, నాచారం, మల్లాపూర్ లోనే చిన్నపాటి జల్లులు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే రాజ్ భవన్ లో రూట్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ ముందు నీళ్లు నిలిచిపోయాయి. ఎల్బీనగర్ లో 2.3సె.మీ, ఖైరతాబాద్ లో 1.5, లింగోజిగూడలో 1.3, సరూర్ నగర్ లో 1.1సె.మీ వర్షపాతం నమోదు అయింది.
అటు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకంపాలెం 6.6 సె.మీ వర్షపాతం నమోదు అయింది. వికారాబాద్ జిల్లా మాడ్గుల్ చిట్టెంపాల్లిలో 4.4 సెం.మీ, ఆదిలాబాద్ లో 4.3, ములుగు అలుబకాలో 3.9, ఖమ్మంలో 3.4, రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో 2.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాగర్ కర్నూల్ లో 2.1, సంగారెడ్డి జిల్లా పాల్వాట్లలో 1.9, నిజామాబాద్ జిల్లా కలెదుర్కిలో 1.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
