న్యూఢిల్లీ: పారిస్ ఒలింపియన్ రైజా దిల్లాన్ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో డబుల్ గోల్డ్ మెడల్‌తో మెరిసింది. శనివారం జరిగిన విమెన్స్ స్కీట్ ఫైనల్లో 21 ఏళ్ల రైజా 56 పాయింట్లతో పోడియం ఫినిష్ చేసింది. యశస్వి రాథోర్ (55), గనేమత్ షోకోన్ (45) వరుసగా సిల్వర్, బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్స్‌లో యశస్వి 118, రైజా, గనేమత్ చెరో 116 పాయింట్లతో నిలిచారు. అయితే షూటాఫ్‌లో రైజా 5, గనేమత్ 4 పాయింట్లు నెగ్గి ఫైనల్‌కు అర్హత సాధించారు.
విమెన్స్ టీమ్ ఈవెంట్‌లో యశస్వి దర్శన–మహేశ్వరీ చౌహాన్ జోడీ 343 పాయింట్లతో గోల్డ్‌ను సొంతం చేసుకుంది. ఇక జూనియర్ స్కీట్ ఫైనల్లో రైజా 55 పాయింట్లతో గోల్డ్ మెడల్‌ను సాధించింది. వాన్షికా తివారీ (54), మాన్సి రఘువంశీ (45) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. జూనియర్ విమెన్స్ టీమ్ ఈవెంట్‌లో వాన్షికా తివారీ–మాన్సి రఘువంశీ–ఒష్మి శ్రీవాస్‌తో కూడిన బృందం 328 పాయింట్లతో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. రాజస్తాన్ (326), పంజాబ్ (314) సిల్వర్, బ్రాంజ్‌ను నెగ్గాయి.
