OMG: ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఆక్సిజన్ మాస్క్కు మంటలు

OMG: ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఆక్సిజన్ మాస్క్కు మంటలు

నాలుగు రోజుల క్రితం కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి.. ఆక్సిజన్ మాస్క్‌కు మంటలు అంటుకొని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. 

రోగి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంత్‌పురా తలాబ్‌లో నివాసం ఉంటున్న వైభవ్ శర్మ అనే వ్యక్తి అనారోగ్యం బారిన పడగా.. కుటుంబసభ్యులు అతనిని కోటాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రోగి ఆరోగ్యం విషమించడంతో వైద్యులు అతనికి కార్డియోవర్షన్ షాక్ ట్రీట్‌మెంట్ అందించారు. ఆ సమయంలో అతని ముఖంపై ఉన్న ఆక్సిజన్ మాస్క్‌కు మంటలు అంటుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు నుండి నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నట్లు బాధితుడి తరపు బంధువులు ఆరోపించారు. సకాలంలో వైద్యులు స్పందించి ఉంటే అతడు బతికేవాడని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.. వారం రోజుల్లోగా పూర్తి నివేదికను తమ ముందు ఉంచాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.