రాజస్థాన్ లో భారీ వర్షాలు: సహాయం కోసం జనం ఎదురుచూపులు

రాజస్థాన్ లో భారీ వర్షాలు: సహాయం కోసం జనం ఎదురుచూపులు

రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. బరాన్ లో వరద ముంచెత్తింది. పార్వతి నదీ ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద దాటే క్రమంలో ఇద్దరు యువకులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అతి కష్టం మీద వారిని కాపాడారు. దీంతో పాటు చురు ప్రాంతంలో వరద ఇళ్లను ముంచెత్తింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుకాణాల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు నష్ట పోయారు. సహాయం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.