Rajasthan Royals: అమ్ముడుపోయిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా రూ.  15 వేల కోట్లకు..

Rajasthan Royals: అమ్ముడుపోయిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా రూ.  15 వేల కోట్లకు..

Rajasthan Royals: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ డీల్ నమోదు అయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అమ్మకం ప్రక్రియ ఎట్టకేలకు పూర్తైంది. భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం, ఈ జట్టును 1.63 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో వార్త కథనాలు వస్తున్నాయి. ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 15,280 కోట్ల వరకు ఉంటుంది. దీంతో ఒక బిలియన్ డాలర్లకు విక్రయించిన తొలి ఐపీఎల్ జట్టుగా రాజస్థాన్ చరిత్ర సృష్టించింది.
 
అధికారికంగా జట్టు బాధ్యతలు:  
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఈ కొత్త యాజమాన్యం జట్టు బాధ్యతలను అధికారికంగా చేపట్టనుంది. గతంలో ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ లక్నో సూపర్ జెయింట్స్‌ను 940 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు రాజస్థాన్ ఆ రికార్డును అధిగమించింది. అయితే కల్ సోమాని కన్సార్టియానికి వాల్‌మార్ట్ ఫ్యామిలీకి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త రాబ్ వాల్టన్, అలాగే ఎన్‌ఎఫ్‌ఎల్ జట్టు డెట్రాయిట్ లయన్స్‌లో మెజారిటీ వాటాలు కలిగిన హాంప్ కుటుంబం నుంచి ఆర్థికంగా సపోర్టు ఉంది. 

►ALSO READ | RCB vs SRH Rain Alert: ఎస్‌ఆర్‌హెచ్ vs ఆర్సీబీ మ్యాచ్కి బిగ్ షాక్.. ఆరోజు వర్షం పడే ఛాన్స్!

ఎవరీ కల్ సోమాని?: 
అరిజోనాకు చెందిన కల్ సోమాని ఒక ప్రముఖ ఎంట్రప్రెన్యూర్. ఆయనకు డేటా ప్రైవసీ, ఎడ్‌టెక్ (EdTech), క్రీడా సాంకేతికత లాంటి రంగాల్లో 15 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. అతడు ఇంట్రాఎడ్జ్, ట్రూయో వంటి సంస్థలకు వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నారు. 2021 నుంచే ఆయనకు రాజస్థాన్ రాయల్స్‌లో మైనారిటీ వాటాని కలిగి ఉన్నారు. తాజాగా ఇప్పుడు 100 శాతం వాటాను దక్కించుకున్నారు. క్రీడల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న సోమాని.. మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్‌కు సహ-యజమానిగా, TGL గోల్ఫ్ లీగ్‌లలో తొలి పెట్టుబడిదారులలో ఒకరిగా ఉన్నారు.