RCB vs SRH Rain Alert: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన పోరుతో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మార్చి 28వ తేదీన రాత్రి 7:30 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకునేలా కనిపిస్తున్నాయి. మార్చి 28వ తేదీన బెంగళూరులో వర్సం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఆరోజు వర్షం అంతరాయం కలిగించకుండా ఉంటే, ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఓపెనింగ్ మ్యాచ్‌లలో ఒకటిగా నిలుస్తుంది.
గెలిచే అవకాశం ఎవరికి?:
గణాంకాల ప్రకారం, సొంత గడ్డపై ఆడుతుండటంతో ఆర్సీబీకి 54 శాతం గెలిచే అవకాశం ఉండగా, ఎస్‌ఆర్‌హెచ్‌కు 46 శాతం ఛాన్స్ ఉంది.
SRH దూకుడు: హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, లియామ్ లివింగ్‌స్టోన్‌లతో హైదరాబాద్ బ్యాటింగ్ లైన్-అప్ చాలా బలంగా ఉంది. మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్ నుంచే అటాకింగ్ గేమ్‌ను ఆడటమే వీరి ప్రధాన వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు.
RCB బలం: సొంత గడ్డపై ఆడుతుండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ ఓపెనింగ్ జోడీపై భారీ అంచనాలు పెట్టుకుంది ఆర్సీబీ యాజమాన్యం. మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వంటి పవర్‌ఫుల్ హిట్టర్లు ఉన్నారు.
పిచ్ రిపోర్ట్:
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం ఎప్పుడూ బ్యాటర్లకు స్వర్గధామం అని చెప్పాలి. ఇక్కడ 180 పరుగులు కూడా సాధారణ స్కోరుగా పరిగణించబడుతుంది. ఒకవేళ 200+ దాటితే అది గెలిచేందుకు భావించే స్కోర్ గా పేర్కొంటారు. ఈ మైదానంలో చిన్న బౌండరీలు ఉండటంతో సిక్సర్ల వర్షం ఖాయం.
►ALSO READ | RCB Tickets: ఆర్సీబీ మ్యాచ్‌ల కోసం క్యూఆర్ కోడ్ టికెట్స్, ఫ్రీగా మెట్రో జర్నీ
వెదర్ రిపోర్ట్:
* పగటిపూట గరిష్టంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
* సాయంత్రం వేళ 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
* మార్చి 28న సాయంత్రం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, పిడుగులతో కూడిన వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనా: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, మంగేష్ యాదవ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, జీషన్ అన్సారీ, ఈషన్ మలింగ, జయదేవ్ ఉనద్కత్
