RCB Tickets: ఆర్సీబీ మ్యాచ్‌ల కోసం క్యూఆర్ కోడ్ టికెట్స్, ఫ్రీగా మెట్రో జర్నీ 

RCB Tickets: ఆర్సీబీ మ్యాచ్‌ల కోసం క్యూఆర్ కోడ్ టికెట్స్, ఫ్రీగా మెట్రో జర్నీ 

RCB Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మార్చి 28వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఈ పోరుతో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ చూసేందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికే మ్యాచ్ టికెట్లని కొనుగోలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. బెంగళూరు హోం మ్యాచ్ టికెట్లను కేవలం అధికారిక వెబ్‌సైట్ లేదా ఆర్సీబీ యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడంతో పాటు ఉచితంగా నగరంలోని మెట్రోలో ప్రయణం చేయొచ్చని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. 
 
ఫ్యాన్స్ కోసం ఫ్రీ మెట్రో సౌకర్యం
బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఆర్సీబీ యాజమాన్యం క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. మ్యాచ్ టికెట్ ఉన్నవారు స్టేడియానికి వచ్చేందుకు, తిరిగి వెళ్లడానికి ఉచితంగా మెట్రోలో ప్రయాణించవచ్చు అని వెల్లడించింది. మ్యాచ్ జరిగే రోజున కబ్బన్ పార్క్ లేదా ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ల దగ్గర మీ టికెట్‌ను స్కాన్ చేసి జర్నీ చేయొచ్చని పేర్కొనింది. దీని వలన నగరంలోని ట్రాఫిక్ నుంచి తప్పించుకున్న వాళ్లు అవుతారని వెల్లడించింది. 
 
టికెట్ బుక్ చేసుకునే విధానం:
* ఆర్సీబీ యాప్ లేదా పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను సందర్శించండి.
* ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌ను ఎంచుకోండి.
* మీకు కావలసిన సీటింగ్ కేటగిరీ, టికెట్ల సంఖ్యను సెలెక్ట్ చేయండి.
* ఆన్‌లైన్ లో పేమెంట్ పూర్తి చేసి ఈ–-టికెట్ (e-ticket) పొందండి.

ఆర్సీబీ నుంచి యష్ ఔట్: 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేసర్ యష్ దయాళ్ ఈ సీజన్‌లో పాల్గొనడం లేదని ఫ్రాంచైజీ డెరెక్టర్ తెలిపారు. ఇప్పటికే పలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడు ఈ ఏడాది టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో RCB జట్టు చివరి నిమిషంలో తుది జట్టులో మార్పులు చేశారు.  

►ALSO READ | RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. టోర్నీ నుంచి ఫాస్ట్ బౌలర్ యష్ ఔట్

ఆర్సీబీ స్క్వాడ్: 
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, టిమ్ డేవిడ్, జాకబ్ బెథెల్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్‌వుడ్, నువాన్ తుషార, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్, భువనేశ్వర్ కుమార్, జోర్డాన్ కాక్స్, సుయాష్ శర్మ, వెంకటేష్ చోండాల్ సింగ్, జాకన్ చోండాఫ్ సింగ్, స్వాప్ యాదవ్, ఫిల్ సాల్ట్, సాత్విక్ దేస్వాల్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా.