RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. టోర్నీ నుంచి ఫాస్ట్ బౌలర్ యష్ ఔట్

RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. టోర్నీ నుంచి ఫాస్ట్ బౌలర్ యష్ ఔట్

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఆరంభమయ్యేందుకు మరో నాలుగు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తో ఈ టోర్నీ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ కోసం 10 జట్లు తీవ్రంగా సన్నాహకాలు మొదలు పెట్టాయి. ఇప్పటికే ప్లేయర్లందరూ తమ జట్లతో కలిసి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.  

ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ ఈ సీజన్ కు దూరం అయ్యాడు. అతను ఆడటం లేదని ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. అతను ఇంకా జట్టుతో కలవలేదని, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ట్రైనింగ్ సెషన్స్ కు కూడా పాల్గొనలేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఎడిషన్ లో అతడు అందుబాటులో లేదని పేర్కొనింది. 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన యష్ దయాళ్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వాడుకుని వదిలేశాడని అతడిపై  ఘజియాబాద్, జైపూర్ నగరాల్లో కేసులు నమోదు అయ్యాయి. తనపై తప్పుడు కేసులు పెట్టారని వీటిని ధైర్యంగా ఎదుర్కొంటానని పేర్కొన్నాడు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. దీంతో యష్ దయాళ్ ఈ సీజన్ బెంగళూరు పక్కన పెట్టింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న యష్ వ్యక్తిగత కారణాలతో ఈసారి టోర్నీ ఆడట్లేదని ఆర్సీబీ డైరెక్టర్ మో బోబాట్ ధృవీకరించారు.

ALSO READ : ఐపీఎల్ మెగా టోర్నీకి కౌంట్డౌన్.. ఈసారి దబిడిదిబిడే

కాగా కొద్దిరోజుల క్రితం యాష్ దయాళ్ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండిర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీన కొంత మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పెళ్లి జరిగింది. ఈ జంట తమ వివాహం గురించి సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, శ్వేతా పుండిర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యశ్ దయాళ్ తో గడిపిన కొన్ని క్షణాలతో కూడిన ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసింది.