IPL 2026 Countdown: ఐపీఎల్ మెగా టోర్నీకి కౌంట్డౌన్.. ఈసారి దబిడిదిబిడే

IPL 2026 Countdown: ఐపీఎల్ మెగా టోర్నీకి కౌంట్డౌన్.. ఈసారి దబిడిదిబిడే

IPL 2026 Countdown: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నమెంట్ మొదలు కాబోతుంది. ఐపీఎల్ కోసం సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ లీగ్‌లోకి పూర్తి సన్నద్ధతతో ప్రవేశించేందుకు అన్ని జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. మిగిలిన షెడ్యూల్‌ను రాబోయే 2-, 3 రోజుల్లో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. 

 

మరో నాలుగు రోజులే: 

ఐపీఎల్ ప్రారంభానికి కేవలం నాలుగు రోజులే సమయం మిగిలి ఉంది. దీంతో ఫ్రాంచైజీలు, స్టార్ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు ఇప్పటికే ఈ లీగ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు, అభిమానులను ఆకర్షించేందుకు అన్ని టీమ్స్ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా (ట్వీటర్, ఇంస్టాగ్రామ్, ఫేస్‌బుక్) వీడియోలు, ఫోటోలు షేర్ చేసి ఐపీఎల్ పై బజ్ క్రియేట్ చేస్తున్నారు. అభిమానుల కోసం 11 రాష్ట్రాల్లోని 15 నగరాల్లో ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. 

యువత  ఫుల్ ఎంజాయ్: 

ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 28న ప్రారంభమై మే 31వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తం 10 జట్లు పాల్గొని, 84 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత సీజన్‌లతో పోలిస్తే ఈసారి మ్యాచ్‌ల సంఖ్య పెరగడంతో పాటు ప్రతి మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన క్రికెట్ ని అందించనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను  ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత  ఫుల్ ఎంజాయ్ చేసే అవకాశం కినిపిస్తుంది. దీంతో ఈ సీజన్‌లో ఎవరు విజేతలవుతారు అనే దానిపై మరింత ఆసక్తి పెరిగింది. 

ALSO READ : ధోనీ కంటే ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరో తెలుసా! 
 
ఫ్యాన్ పార్క్ తేదీలు: 
ఫస్ట్ వీక్: మార్చి 28 & 29, 2026
సెకండ్ వీక్: ఏప్రిల్ 4 & 5, 2026
థర్డ్ వీక్: ఏప్రిల్ 11 & 12, 2026

ఫ్యాన్ పార్క్‌ల వేదికలు: 
మొదటి వారం: 
రోతక్, (హర్యానా) – చోటు రామ్ పాలిటెక్నిక్ గ్రౌండ్
భోపాల్, (మధ్యప్రదేశ్) – గవర్న్మెంట్ MVM కాలేజ్ గ్రౌండ్
నాగ్‌పూర్, (మహారాష్ట్ర) – మెకోసాబాగ్ మెథోడిస్ట్ హై స్కూల్ ప్లేగ్రౌండ్
తుమకూరు, (కర్ణాటక) – గవర్న్మెంట్ జూనియర్ కాలేజ్ ఫీల్డ్
కృష్ణానగర్, (పశ్చిమ బెంగాల్) – DL రాయ్ స్టేడియం

రెండో వారం: 
మతురా, (ఉత్తరప్రదేశ్) – అమర్నాథ్ విద్యా ఆశ్రమ్
జోధ్పూర్, (రాజస్థాన్) – బర్కతుల్లా ఖాన్ స్టేడియం
నిజామాబాద్, (తెలంగాణ) – వీమెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రౌండ్స్
మైసూరు, 9కర్ణాటక) – SBRR మహాజనా ఫస్ట్ గ్రేడ్ కాలేజ్
భువనేశ్వర్, (ఒడిశా) – KITS యూనివర్సిటీ స్టేడియం

మూడో వారం: 
మeerut, (ఉత్తరప్రదేశ్) – భైన్సాలి గ్రౌండ్
నడియాద్, (గుజరాత్) – రాధే ఫారం
రత్నగిరి, (మహారాష్ట్ర) – స్వర్గీయ ప్రమోద్ మహాజాన్ క్రీడా సంకుల్
కోయంబత్తూరు, (తమిళనాడు) – హిందుస్తాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్
రౌరకేళా, (ఒడిశా) – సెక్టార్ 17 గ్రౌండ్

ఫ్యాన్ పార్క్‌ల సమయం: 
డే గేమ్‌లు: మధ్యాహ్నం 3:30 PM 
ఈవెనింగ్ గేమ్‌లు: సాయంత్రం 7:30 PM