IPL 2026: ధోనీ కంటే ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరో తెలుసా! 

IPL 2026: ధోనీ కంటే ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరో తెలుసా! 

 
IPL 2026: మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి పోరుతో ఈ మెగా టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. కాగాఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా టైటిల్స్ గెలిచిన వ్యక్తి ఎవరు అనగానే టక్కునా  మహేంద్ర సింగ్ ధోనీ పేరునే చెబుతాం.. కానీ ఈ టోర్నీలో ఎక్కువ ట్రోఫీలు గెలిచిన ఆటగాళ్లు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వారే రోహిత్ శర్మ, అంబటి రాయుడు.. వీరిద్దరూ చెరో 6 ఐపీఎల్ టైటిళ్లతో అగ్రస్థానంలో నిలిచారు.  

రోహిత్ శర్మ: 
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా రోహిత్ శర్మకు పేరుంది. అతడు ఇప్పటి వరకు ఆడిన అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ భాగస్వామిగా ఉన్నాడు. 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఐపీఎల్‌లో రోహిత్ డెక్కన్ ఛార్జర్స్ తరపున మొదటి టైటిల్ గెలిచాడు. అనంతరం 2013లో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్, తన నాయకత్వంలో జట్టుకు ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) ట్రోఫీలను అందించాడు. ఇక, 2024లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ, ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాడు. ఈసారి ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిస్తే, 7 ట్రోఫీలు గెలిచిన మొదటి ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.

అంబటి రాయుడు: 
కేవలం 14 సీజన్లు మాత్రమే ఆడినప్పటికీ, రాయుడు ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. 2010లో ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన రాయుడు, ముంబై ఇండియన్స్ గెలిచిన 2013, 2015, 2017 టైటిళ్లలో భాగస్వామిగా ఉన్నాడు. ఆ తర్వాత 2018లో CSKలో చేరిన అంబటి రాయుడు 2018, 2021, 2023లో టైటిల్స్ గెలిచాడు. 2023 ఫైనల్ తర్వాత ఆతడు ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఎంఎస్ ధోనీ: 
ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో ఇప్పటి వరకు కేవలం 5 ఐపీఎల్ ట్రోఫీలు మాత్రమే గెలిచాడు. ఈ ఐదు ట్రోఫీలు (2010, 2011, 2018, 2021, 2023) అతడు కెప్టెన్‌గా ఉన్నప్పుడే సాధించాడు. ప్రస్తుతం అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్న మహేంద్రుడు 4 కోట్ల రూపాయలకు చైన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ఈ సీజన్‌లో కూడా అతడు పూర్తిస్థాయిలో ఆడనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ధోనీ తన 6వ ట్రోఫీ కోసం బరిలోకి దిగనున్నాడు.