టిక్ టాక్ కోసం ఉరేసుకున్న పిల్లాడు

టిక్ టాక్ కోసం ఉరేసుకున్న పిల్లాడు

టిక్ టాక్ వీడియో మోజులో ఓ పిల్లాడి ప్రాణం పోయింది.  రాజస్థాన్ కోటా ప్రాంతానికి చెందిన ఓ మైనర్ పిలగాడు టిక్ టాక్ వీడియో కోసం తన తల్లి గాజులూ, బొట్టు పెట్టుకుని వీడియో తీద్ధామని ప్రయత్నించాడు. దీంతో గాజులు పెట్టుకుని బాత్ రూంలోకి వెళ్లి మెడకు ఇనుప గొలుసు చుట్టుకుని వీడియో తీయడానికి ప్రయత్నించాడు. ఆ గొలుసు మెడకు గట్టిగా చుట్టుకుని ఊపిరాడక చనిపోయాడు పిల్లాడు.

బాత్ రూం నుంచి పిల్లాడు ఎంతకీ బయటకు రాకపోవడంతో తలుపులను పగులకొట్టి లోపలికి వెళ్లి చూశారు అతని కుటుంబ సభ్యులు. అక్కడే ప్రాణం లేకుండా పడి ఉన్న పిలగాన్ని చూసి రోధించారు.టిక్ టాక్ వీడియోను గమనించగా జరిగిన విషయం అర్థం చేసుకున్న అతని కుటుంబ సభ్యులు… టిక్ టాక్ లేకుంటే తమ కొడుకు బ్రతికి ఉండేవాడని అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని శవపరీక్ష చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.