'శాసనసభ'లో రాజేంద్ర ప్రసాద్

'శాసనసభ'లో రాజేంద్ర ప్రసాద్

టాలీవుడ్ సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ 'శాసనసభ'. ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇవాళ ఈ చిత్రం నుండి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన ఈ పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది. చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా ఉండనుందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. 

పొలిటికల్ థ్రిలర్ గా యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఎమ్మేల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇంద్ర సేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటించిన ఈ మూవీలో సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. 

తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకి కథ,మాటలు రాఘవేందర్ రెడ్డి అందించారు.