శంషాబాద్, వెలుగు: శంషాబాద్ జోన్ కొత్త డీసీపీగా బి.రాజేశ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన డీసీపీ కె. నారాయణరెడ్డి బదిలీపై వికారాబాద్ డీసీపీగా వెళ్లగా.. రాజేశ్ కు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. అనంతరం డీసీపీ రాజేశ్ మాట్లాడుతూ.. శంషాబాద్ జోన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అదుపులో ఉండేలా కృషి చేస్తానని, అన్ని రాజకీయ పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. కొత్త డీసీపీకి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇన్ స్పెక్టర్ బాలరాజు బొకే ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
