చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన పెరారివలన్ (54) ఇప్పుడు న్యాయవాదిగా మారారు. తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌లో ఆయన పేరు నమోదు చేసుకున్నారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పరికరం కోసం 9 ఓల్టుల బ్యాటరీని సరఫరా చేశారన్న ఆరోపణతో 19 ఏండ్ల వయస్సు ఉన్న పెరారివలన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
31 ఏండ్ల జైలు జీవితం తర్వాత పెరారివలన్‌ను సుప్రీంకోర్టు 2022లో రిలీజ్ చేసింది. జైలులో ఉన్న కాలంలో పెరారివలన్ బెంగళూరులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

