బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ముగిసింది. ఈ ఘటన సంబంధించి సమగ్ర నివేదికను ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సమర్పించారు. దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చినప్పటికీ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అటు కేంద్రం గానీ, ఇటు ఎయిర్ ఫోర్స్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వాతావరణం అనుకూలించని కారణంగానే ప్రమాదం జరిగినట్లు నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కోయంబత్తూరు నుంచి బయలుదేరిన MI-17V5 హెలికాప్టర్‌ కనూర్‌ సమీపంలో దట్టమైన మేఘాలల్లో చిక్కుకోవడంతో దారి కనిపించక పైలట్‌ ఇబ్బందులు పడి ఉంటారని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దారి కోసం పైలెట్ రైల్వే లైన్ ను అనుసరించడంతో హెలికాప్టర్ ఎత్తైన కొండను ఢీకొని అంతే వేగంతో కిందకు పడిపోయినట్లు నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.
గతేడాది డిసెంబర్ 8న తమిళనాడులోని నీలగిరి కొండల్లో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు అతని భార్య మధులిక సహా  14 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై కేంద్రం ట్రై సర్వీసెస్ విచారణకు ఆదేశించగా.. ఇవాళ నివేదిక సమర్పించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఎలాంటి టెక్నికల్, మెకానికల్ డిఫెక్ట్ లు తలెత్తలేదని దర్యాప్తు బృందం తేల్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం..

మహిళ వివాహ వయసుపై కమిటీ.. కనిమొళి అభ్యంతరం

అనాథల తల్లి సింధుతాయ్ ఇకలేరు