అనాథల అమ్మ సింధుతాయ్ ఇకలేరు

అనాథల అమ్మ సింధుతాయ్ ఇకలేరు

పూణె: ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్ కన్నుమూశారు. హార్ట్ స్ట్రోక్ తో ఆమె ముంబై గెలాక్సీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అనేక మంది అనాథలను అక్కున చేర్చుకున్న సింధుతాయ్ సప్కల్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఆమెకు దాదాపు 750కి పైగా పురస్కారాలు లభించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆమెను అహల్యాబాయ్ హోల్కర్ పురస్కారంతో సత్కరించింది. అనాధల తల్లిగా పిలవబడే  సింధుతాయ్.. మహారాష్ట్రలోని వార్ధాలో జన్మించారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ పుణె శివార్లలో జరుగుతాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం: 

ఉద్యమకారులతో పెట్టుకోవద్దు

బూస్టర్ డోసుగా చుక్కల మందు టీకా!

నిరాశలో ప్రభాస్ అభిమానులు