మహిళ వివాహ వయసుపై కమిటీ.. కనిమొళి అభ్యంతరం

మహిళ వివాహ వయసుపై కమిటీ.. కనిమొళి అభ్యంతరం

చెన్నై: మహిళల వివాహ వయసు చట్టబద్ధత బిల్లు విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్ పై డీఎంకే ఎంపీ కనిమొళి అభ్యంతరం తెలిపారు. పార్లమెంటరీ ప్యానెల్ లో ఒంటరి మహిళను చేర్చడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రాధాన్యతతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘మహిళల వివాహ వయసు చట్టబద్ధత బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ లో కేవలం ఒక్కరే మహిళ ఉండటాన్ని నేను ఖండిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యానెల్ ను ఏర్పాటు చేయాలి. అందులో ఎక్కువ మంది మహిళా ప్రతినిధులు ఉండాలి’ అని కనిమొళి స్పష్టం చేశారు. స్త్రీల హక్కులను పురుషులే నిర్ణయించే పద్ధతి కొనసాగుతోందని మండిపడ్డారు. 

కాగా, అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న స్టాండింగ్‌ కమిటీలో ఒక్కరే మహిళ ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ నేత వినయ్‌ సహస్రబుద్దే నేతృత్వంలోని 31 మందితో కూడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్‌ కమిటీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌ ఒక్కరే మహిళ ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తల కోసం: 

అనాథల తల్లి సింధుతాయ్ ఇకలేరు

ఉద్యమకారులతో పెట్టుకోవద్దు

సోషల్ మీడియా కామెంట్స్ పై పోలీసులు సీరియస్