సోషల్ మీడియా కామెంట్స్ పై పోలీసులు సీరియస్

సోషల్ మీడియా కామెంట్స్ పై పోలీసులు సీరియస్

తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. బండి సంజయ్ జాగరణ దీక్ష అరెస్ట్ తో పొలిటికల్ హీట్ రాజుకుంది. దీంతో  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు ఇరు పార్టీల నేతలు.. పదునైన వ్యాఖ్యలు చేస్తూ మరింత వేడి రాజేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఫోకస్ చేశారు. ఇక పై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే బావుంటదంటూ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని రెచ్చగొట్టి, కించపరిచే వ్యాఖ్యలు చేయోద్దన్నారు. అలా చేస్తే.. ఎంతటివారైనా సరే కేసులు పెట్టి విచారణను స్పీడప్ చేస్తామన్నారు. విద్వేష పూరితమైన ట్వీట్లు చేస్తే లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఎన్ఆర్ఐ లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్ఆర్ఐ ల పాస్ పోర్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు.  

ఇవి కూడా చదవండి: 

ఉద్యమకారులతో పెట్టుకోవద్దు

బండి సంజయ్ క్రిమినల్ కాబట్టే.. పది కేసులు