బండి సంజయ్ క్రిమినల్ కాబట్టే.. పది కేసులు

బండి సంజయ్ క్రిమినల్ కాబట్టే.. పది కేసులు

బిజేపి నేతలపై మండిపడ్డారు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.  బీజేపీ నేతలంతా తాలిబన్ల లెక్క తయారయ్యారన్నారు.  గన్ మెన్ లు లేకుండా బండి సంజయ్, అరవింద్ లని జనాల్లో తిరగమనండి అంటూ జీవన్ రెడ్డి సవాల్ చేశారు. బండి సంజయ్ కి నేర చరిత్ర ఉంది కాబట్టే  ఆయనను జైలులో వేశారన్నారు. బండి సంజయ్, అరవింద్ మీద పిడి యాక్ట్ కేసులు పెట్టాలన్నారు. ఆట ఇపుడే మొదలైంది... కాస్కొండి అంటూ  బీజేపీ నేతలకు సవాల్ చేశారు జీవన్ రెడ్డి. బండి సంజయ్ ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా అంటూ నిలదీశారు. మతాల మధ్య, కులాల మధ్య బండి సంజయ్ అనే క్రిమినల్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు రోజుల నుంచి రాష్ట్రం చాలా ప్రశాంతంగా వుందన్నారు. బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలంటే 20 సార్లు అరెస్ట్ చేసేవాళ్లమన్నారు ఎమ్మెల్యే. సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుత.. జైలుకు పంపుత.. అన్నాడు ఆయననే జైలుకు పోయాడు.. తథాస్థు దేవతలు వుంటారు పైన అంటూ సెటైర్లు వేశారు. 

బండి సంజయ్ ని అరెస్ట్ చేస్తే ఒక్కరూ కూడా మద్దతు ప్రకటించలేదన్నారు. అంతా కూడా శని పోయిందని అనుకుంటున్నారన్నారు. సంజయ్ క్రిమినల్ కాబట్టే 10 కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు సంక్రాంతిని సంతోషంగా చేసుకుంటారన్నారన్నారు జీవన్ రెడ్డి. బిజెపి అధ్యక్షులు నడ్డా.. సీఎం కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డా... ఏ ఊరికి వెళ్లి అయినా మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయో లేవో చూడాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని పార్లమెంట్ లో కేంద్రమే చెప్పిందన్నారు. సీఎం కేసీఆర్ కు అవినీతి తెలియదన్నారు. తెలంగాణ నీతి ఒక్కటే తెలుసన్నారు. అవినీతి మరకలు దగ్గరకు కూడా రానివ్వరన్నారు. అవినీతి పార్టీ బీజేపీయే అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ఏ టూ జెడ్ స్కాంలు అన్నీ బీజేపీలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా విమర్శల దాడి చేశారు. రేవంత్ రెడ్డికి దిమాక్ వుందా.. టీఆర్ఎస్, బిజెపి కలిశాయా? ఎవరు ఎక్కడ కలిసి పోటీ చేశారో మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎవరు ఎవరిని కలిశారో అందరికీ తెలుసన్నారు. మేం యుద్దం స్టార్ట్ చేస్తే.. ఇక్కడ ఒక్కరూ కూడా లేరన్నారు జీవన్ రెడ్డి. 

ఇవి కూడా చదవండి:

గాంధీ ఫోటోపై భువనగిరి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

కొత్తగూడెం ఫ్యామిలీ సూసైడ్ లో నాలుగుకు చేరిన మృతులు