రాజు డెడ్‌బాడీకి పోస్టుమార్టం..అంబులెన్స్‌పై చెప్పుల దాడి

రాజు డెడ్‌బాడీకి పోస్టుమార్టం..అంబులెన్స్‌పై చెప్పుల దాడి

స్టేషన్ ఘన్ పూర్ రాజారాం బ్రిడ్జి దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న రాజు డెడ్ బాడీని వరంగల్ MGMకు తరలించారు. అక్కడ డెడ్ బాడీకి పోస్టు మార్టం చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను వరంగల్ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. రాజు కుటుంబం అడ్డగూడురులోనే ఉంది. వాళ్లెవరు వరంగల్ వెళ్లలేదు.  మరోవైపు రాజు డెడ్ బాడిని MGM తీసుకెళ్లే సమయంలో స్థానికులు అంబులెన్స్ పై దాడికి ప్రయత్నించారు. అంబులెన్స్ ను చెప్పులతో కొట్టారు. 

వారం రోజులుగా ఎవరికీ దొరక్కండా తప్పించుకొని తిరిగిన ఉన్మాది రాజు ఈ ఉదయం వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ దగ్గర్లో రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు. నాష్కల్ రైల్వే ట్రాక్ పై రాజు డెడ్ బాడీని గుర్తించారు. ఘటనను రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కన్ఫామ్ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ దగ్గర మృతదేహాన్ని గుర్తించామని , నిందితుడి బాడీపై ఉన్న గుర్తుల ఆధారంగా నిర్ధారించామని చెప్పారు డీజీపీ. 

మృతుడి చేతిపై ఉన్న మౌనిక అనే పేరు పచ్చబొట్టు ఆధారంగా డెడ్ బాడీ రాజుదేనని గుర్తించినట్లు వరంగల్ సీపీ తరుణ్ జోషి చెప్పారు. రాజు చేతిపై మౌనిక పేరుతో పాటు మరో చేతిపై స్టార్స్ టాటూలు ఉన్నాయి. వీటిని చూసే డెడ్ బాడీ రాజుదేనని గుర్తించినట్లు చెప్పారు వరంగల్ సీపీ. విషయం తెలిశాక స్పాట్ కు చేరుకున్నారు స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు. అతని చేతిపై రెండు రకాల టాటూస్ ఉన్నాయి. ఒకటి మౌనిక అనే పేరు పచ్చబొట్టు కాగా... మిగతావి స్టార్ ఆకారంలోని టాటూస్. వాటి ఆధారంగా ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి రాజు అని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని DGP మహేందర్ రెడ్డి, మంత్రి KTR ట్విట్టర్ లో ప్రకటించారు