చిన్న చిత్రంగా విడుదలై ప్రేక్షకుల ఆదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. తాజాగా ఆ చిత్ర మేకర్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు.
తెలంగాణ మట్టివాసనతో కూడిన మరో గ్రామీణ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా నిర్మిస్తుండగా, మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన పంచాయితీ తెలంగాణలోని జమ్మికుంట గ్రామ భవితవ్యాన్ని ఎలా మార్చింది? వారిలో ఎవరు గెలిచినా ఊరు మాత్రం ఎందుకు ఓడిపోయింది? అనే ఆసక్తికర ప్రశ్నల చుట్టూ ఈ కథ సాగనుందని మేకర్స్ తెలియజేశారు. “ఏ ఇంట్లోనూ జరగకూడని ఈ కథలో అసలు ఏమి జరిగింది?” అనే ప్రశ్నతో మేకర్స్ విడుదల చేసిన కాస్టింగ్ కాల్ ఆసక్తిని పెంచుతోంది.
