సీనియర్ హీరోతో లిప్ లాక్.. తరువాత నుండి నో ఆఫర్స్

సీనియర్ హీరోతో లిప్ లాక్.. తరువాత నుండి నో ఆఫర్స్

ఆ సీనియర్ హీరోతో ముద్దు సీన్స్ లో నటించకుండా ఉండాల్సింది. ఆతరువాత నుండి నాకు ఆఫర్స్ తగ్గిపోయాయి అంటూ క్రేజీ కామెంట్స్ చేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రకుల్ ను..  మీకు  సౌత్ లో అవకాశాలు తగ్గిపోవడానికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు అని అడిగింది. దానికి సమాధానంగా రకుల్..

"నాకు సౌత్ లో ఎంతో మంచి ఫేమ్ ఉంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేశాను కానీ.. ఒకే ఒక్క తప్పు చేశాను. అదేంటంటే.. ఒక సీనియర్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం. అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. ఆ సినిమా కూడా భారీ ఫ్లాప్ అయ్యింది. అప్పటినుంచి  సౌత్ ఇండస్ట్రీలో నాకు అవకాశాలు తగ్గిపోయాయని" చెప్పుకొచ్చింది రకుల్.
 
అయితే టాలీవుడ్ లో రకుల్ నటించిన ఏకైక సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మాత్రమే. అదే మన్మధుడు2. ఈ సినిమాలో బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయింది రకుల్. ఆ సినిమా తరువాత ఒక్క సౌత్ సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఆమె ఆ ముద్దు సీన్స్ లో నటించకపోయివుంటే బాగుండు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రకుల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.