భారతీయ పండుగలలో ఒక్కో పండుగకు ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉంటుంది. రాఖీ పండుగ ప్రతీ ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం అధిక శ్రావణ మాసాలు రావటంతో ఓ విశేషమైతే..రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి..? అనేది కూడా ఓ ప్రశ్నార్థకంగా మారింది. పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలోనే సోదరులకు రాఖీ కట్టాలి. కానీ ఏడాది మాత్రం పౌర్ణమి ఏ రోజున వచ్చింది.. పౌర్ణమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి ? రాఖీ పౌర్ణమి ఆగస్టు 30నా, 31నా అనే పెద్ద సందేహం వచ్చింది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే ఆగస్టు 30,31 .అంటే తగుళ్లు మిగుళ్లు అంటారే అలాగన్నమాట. అంటే పౌర్ణమి రెండురోజులలో ఉంది. అయితే పౌర్ణమి ఘడియల్లోనే రాఖీ కట్టాలి కదా..అమరి ఎప్పుడు కట్టాలి..? అనే ధర్మ సందేహంతో సోదరీమణులు తెగ సతమతమైపోతున్నారు. ఒకరు 30 అంటారు మరొకరు 31 అంటారు..మరి ఎప్పుడు కట్టాలి..? అనే విషయాన్ని తెలుసుకుందాం. . .
హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమరోజును రాఖీ పండుగగా జరుపుకోవడం పరిపాటి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి గడియలు ఆగష్టు 30 ఉదయం 10:59 నుండి ప్రారంభమై ఆగష్టు 31 ఉదయం 7:05 వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి. అయితే ఆగష్టు 30వ తేదీ ఉదయం 10.59 గంటల నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్ర కాలం ఉందని పంచాంగ కర్తలు చెబుతున్నారు. కనుక ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదట. అందుకే ఈ భద్ర కాల సమయం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 30న పౌర్ణమి గడియలు ఉన్నప్పటికి రాత్రి 9.02 వరకు భద్రకాలం ఉందట. భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదంటున్నారు. అలా కడితే దోషమని..భధ్ర కాల ప్రభావం వారి(సోదరులపై)పై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీ అస్సలు కట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. అక్కాతమ్ముళ్ళు ఈ పండుగరోజున తమ ప్రేమానురాగాలను చాటిచెబుతుంటారు. అక్కాచెల్లెళ్ళు తమ అన్నదమ్ములు బాగుండాలని రక్ష కడితే.. తామెప్పుడూ తమ తోబుట్టువులకు తోడుగా ఉంటామని అన్నదమ్ములు భరోసా ఇస్తుంటారు.
మరి రాఖీ ఎప్పుడు కట్టాలి..?
హిందూ క్యాలుండర్ ప్రకారం రాఖీ 30,31 రెండు తేదీలలో వచ్చింది. అయితే పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9.02 గంటల వరకు భద్రకాలం ఉందని పంచాగ కర్తలు తెలుపుతున్నారు. అందవలన 30 వ తేదీ రాత్రి 9 .02 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు రక్షాబంధనం కట్టవచ్చని సూచిస్తున్నారు. అక్కచెల్లెళ్లుఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చట. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుంది. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
భద్రకాలం ... ప్రమాదకాలం
భద్రకాలం చాలా ప్రమాదకరం అని ఆ సమయంలో కడితే హాని, నష్టం జరుగుతుందంటారు. భద్ర.. లంకాధిపతి రావణాసురుడు సోదరి అని చెబుతారు. ( భద్ర శని దేవుడి సోదరి అని కూడా అంటారు) ఇక రావణుడు సోదరిగా చెబుతున్న భద్ర విషయానికొస్తే.. తన అన్నగారైన రావణుడికి భద్ర ...పౌర్ణమి అని పొరపాటు పడి రక్షాబంధనాన్ని పౌర్ణమి రాకముందే కట్టిందట. అందుకే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెబుతారు.
పురాణాల ప్రకారం ..
సూర్యుడి కుమార్తె భద్ర. అంటే శనిదేవుడి సోదరి. శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందంటారు. భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట. అంటే పనులూ అడ్డుకోవడం, శుభకార్యాలకు అడ్డుపడడం చేస్తుందట. భద్ర నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుంటుందని..ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవని అందుకే భద్రకాలం అంటే చాలా ప్రమాదకర కాలం అని పండితులు చెబుతుంటారు.అందుకే భద్ర కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. అలా ఈ ఏడాది (2023) ఆగస్టు 30న భద్రకాలం వచ్చిందని చెబుతున్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడని సూచిస్తున్నారు.