రాక్షసుడు ధియేట్రికల్ ట్రైలర్ : నేనంటే భయానికే భయం

రాక్షసుడు ధియేట్రికల్ ట్రైలర్ : నేనంటే భయానికే భయం

రమేష్‌ వర్మ పెన్మత్స డైరెక్షన్ లో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమా రాక్షసుడు. శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ నటించిన ఈ మూవీ ధియేట్రికల్ ట్రైలర్ ను  గురువారం రిలీజ్ చేశారు. ‘నేనంటే భయానికే భయం.. నా గురించి వెతకొద్దు’ అంటూ ఓ సీరియల్‌ కిల్లర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన బెల్లకొండ శ్రీనివాస్‌ కు వార్నింగ్‌ ఇస్తున్న డైలాగ్‌ లో ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోదిం.

ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? వాడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు? కోణంలో హీరోకి ఎదురైన సంఘనటలు ఏవి? మొత్తం స్క్రీన్ పై చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు నిర్మించిన  ‘రాక్షసుడు’ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.