ఒక్కడిలో ముగ్గురు.. ఆర్ఆర్ఆర్ లో డిఫరెంట్ షేడ్స్ లో చెర్రీ

ఒక్కడిలో ముగ్గురు.. ఆర్ఆర్ఆర్ లో డిఫరెంట్ షేడ్స్ లో చెర్రీ

ఓ వైపు వరుస షూటింగ్స్, మరోవైపు త్వరలో స్టార్ట్ కానున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్.. ఈ బిజీ షెడ్యూల్స్ మధ్య చిన్న బ్రేక్ తీసుకున్నాడు రామ్ చరణ్‌‌. స్విట్జర్లాండ్‌‌లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. తిరిగి రాగానే తారక్, రాజమౌళితో కలసి ప్రమోషన్స్‌‌ మొదలుపెట్టనున్నాడు. అంతకంటే ముందు ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ డిటెయిల్స్‌‌ రివీల్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’లో తన క్యారెక్టర్‌‌‌‌ ఒకటే అయినా మూడు లుక్స్‌‌లో కనిపించనున్నాడట. మూడూ డిఫరెంట్‌‌గా ఉంటాయట. 

ఆల్రెడీ చరణ్ ను పోలీస్‌‌ గెటప్ చూశాం. అయితే అల్లూరితో పాటు మరో లుక్‌‌ రివీల్ కావాల్సి ఉంది. అలాగే ‘ఆచార్య’లో తండ్రితో కలసి నటిస్తున్నాడు చెర్రీ. మూవీ సెకెండాఫ్‌‌లో వచ్చే తన క్యారెక్టర్‌‌‌‌ నలభై నిముషాల పాటు ఉంటుందని కూడా చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక శంకర్ డైరెక్షన్‌‌లో చేస్తున్నది పొలిటికల్ డ్రామా అనే విషయాన్ని కన్‌‌ఫర్మ్ చేసిన చరణ్.. ఓ ఫ్యాన్‌‌ బాయ్‌‌లా షూటింగ్‌‌ను ఎంజాయ్‌‌ చేస్తున్నానని చెప్పాడు. 2023 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుందంటూ రిలీజ్ అప్‌‌డేట్ కూడా ఇచ్చాడు. అంటే జనవరిలో ‘ఆర్ఆర్ఆర్’, ఫిబ్రవరిలో ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకొస్తున్న తను.. మళ్లీ ఏడాది తర్వాతే తెరపై కనిపించనున్నాడు. మరోవైపు గౌతమ్‌‌ తిన్ననూరి డైరెక్షన్‌‌లో చరణ్ నటించే సినిమా ఫిబ్రవరి తర్వాత సెట్స్‌‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.