రెండు మూడు వారాల్లోనే యుద్ధాన్ని ఫినిష్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లలలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఆ ప్రభావం బులియన్ మార్కెట్లలో కూడా కనిపిస్తోంది. బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలో పెరిగిన రేట్లను పరిశీలించటం ముఖ్యం.
ఏప్రిల్1న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. మార్చి 31 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.197 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 148గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 885గా కొనసాగుతోంది.
ALSO READ : చివరికి లాభం సున్నా..!
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్1, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 55వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.255గా ఉంది.
