చివరికి లాభం సున్నా..! రెండేళ్లలో స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లకు రాబడి నిల్

చివరికి లాభం సున్నా..! రెండేళ్లలో స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లకు రాబడి నిల్

న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు గత రెండు ఏళ్లలో ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభాలనూ అందించలేకపోయాయి. ఒకప్పుడు లక్ష పాయింట్లకు చేరుతుందని ఆశించిన సెన్సెక్స్ ఇప్పుడు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ ఏడు శాతం నష్టపోయి 72 వేల మార్కు వద్ద ముగిసింది. ఎఫ్​ఐఐలు సుమారు రూ. 1.8 లక్షల కోట్లు వెనక్కి తీసుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. 

పశ్చిమాసియాలో యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల, బలహీనమైన కార్పొరేట్ ఫలితాలు వంటి అంశాలు మార్కెట్లను కుంగదీశాయి. ఐటీ, రియల్టీ వంటి కీలక రంగాలు భారీగా నష్టపోయాయి. వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు కూడా తోడయ్యాయి. దీంతో గత రెండు ఏళ్ల నుంచి ఇన్వెస్టర్ల సంపద పెరగలేదు. నిఫ్టీ కూడా ఐదు శాతం నష్టాల్లో ముగిసింది. ఇక ముందు కూడా నష్టాలు కొనసాగవచ్చని భావిస్తున్నారు