గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, U/A సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది.
రన్ టైమ్ ఎంతంటే?
అయితే, ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 189 నిమిషాలు (3 గంటల 9 నిమిషాలు) ఉండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో ఇంత నిడివితో వస్తున్న భారీ చిత్రం ఇదే కావడం విశేషం. సినిమాలో ఉన్న కొన్ని బూతు పదాలను సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. ముఖ్యంగా, ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన 'చికిరి చికిరి' సాంగ్‌లో వివాదాస్పదంగా మారిన 'సరుకు సామాన్' అనే లిరిక్‌ను పూర్తిగా మార్చేసి, కొత్త లైన్‌ను జోడించారు. ఆ కొత్త లైన్ ఏంటనేది థియేటర్లలోనే చూడాలి.
భోపాల్‌లో హంగామా..
ట్రైలర్ లాంచ్‌తో ముంబైని షేక్ చేసిన చిత్రయూనిట్, ఇప్పుడు 'హలో హలో' అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ కోసం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గ్రాండ్ ఈవెంట్‌కు ప్లాన్ చేసింది. ఈ రోజు ( మే 23న ) ఈ వేడుక కోసం మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, రామ్ చరణ్ కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 'పెద్ది అండ్ ఐ ఎన్‌రూట్ టు భోపాల్' అంటూ పెట్టిన ఈ పిక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో చరణ్ చేతికి గాయమైనా లెక్కచేయకుండా ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఇద్దరు ఆస్కార్ లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు."
►ALSO READ | ‘మనోడు వస్తున్నాడు..’ పూనకాలు తెప్పిస్తున్న అఖిల్ ‘లెనిన్’ టీజర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తో కలిసి శృతి హాసన్ స్టెప్పులేయగా, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా మెరవనుంది. ఈ చిత్రంలో చరణ్ క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ వంటి మూడు విభిన్న క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. థియేటర్లలో 'పెద్ది' సృష్టించబోయే రికార్డుల కోసం మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..
