టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మే 23న.. అక్కినేని అభిమానులకు డబుల్ ధమాకా. నాగ్ కెరీర్ మైల్‌స్టోన్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ, ఆయన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ తన తండ్రికి ఒక క్రేజీ అండ్ మెమరబుల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ (Lenin) నుంచి పవర్‌ఫుల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌కు మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టీజర్ తో ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.
ఈ 'లెనిన్' టీజర్ అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. క్లాసిక్ 'దాన వీర శూర కర్ణ'లోని ఎన్టీఆర్ ఐకానిక్ డైలాగ్ 'ఏమంటివి ఏమంటివి...' అంటూ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్టేజ్ ఫర్ఫార్మెన్స్‌తో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. పల్లెటూరి యాస, గోదావరి నేపథ్యంతో సాగే ఈ టీజర్‌లో అఖిల్ రగ్గడ్, స్టైలిష్ మాస్ లుక్‌లో ఊరమాస్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా 'మనోడు వస్తున్నాడు…', 'నేను తప్పిపోయి రాలేదు.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా…' అంటూ అఖిల్ పలికిన డైలాగ్స్, చూపించిన యాటిట్యూడ్ అల్టిమేట్ అనిపిస్తున్నాయి.
ఈ టీజర్‌పై కింగ్ నాగార్జున ఎమోషనల్ అవుతూ.. 'నా సినీ ప్రస్థానం మొదలైన రోజే నా కొడుకు నాకు బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు, టీజర్ చాలా హాయిగా, కిక్ ఇచ్చేలా ఉంది.. మనోడు వస్తున్నాడు!' అంటూ ట్వీట్ చేయడంతో ఇది మరింత వైరల్‌గా మారింది. అటు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.
సెన్సేషనల్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. గత చిత్రాల ఫలితాల తర్వాత అఖిల్ పక్కా ప్లానింగ్‌తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఈ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. లవ్, యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో కుదిరిన 'లెనిన్' చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈసారి బాక్సాఫీస్ దగ్గర అక్కినేని వారసుడి ర్యాంపేజ్ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అప్పుడే ట్రెండ్ చేస్తున్నారు.
