వైఎస్సార్‌ సీపీలో చేరిన సీబీఎన్‌: RGV

వైఎస్సార్‌ సీపీలో చేరిన సీబీఎన్‌:  RGV

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఇటీవలే ఆయన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా  అనేక వివాదాల మధ్య తెలంగాణ రాష్ట్రంలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే కారణంతో ఏపీలో విడుదల కాలేదు.

తాజాగా ఆయన ట్విటర్ లో షేర్ చేసిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీలో చేరినట్టు, వైసీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు పార్టీ కండువా కప్పుతున్నట్టుగా ఉన్న ఓ మార్ఫింగ్ ఫోటోను ట్విటర్ లో  షేర్‌ చేశారు వర్మ. దీనికి ’వావ్‌ షాకింగ్‌ ట్విస్ట్‌, వైఎస్సార్‌ సీపీలో చేరిన సీబీఎన్‌’  అని క్యాప్షన్‌ పెట్టారు.  ఈ ఫోటో చూసిన నెటిజన్లు తమకు తోచినట్లుగా కామెంట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.