బ్రేకప్ అయ్యిందా.. ఫ్రీడమ్ వచ్చిందా

బ్రేకప్ అయ్యిందా.. ఫ్రీడమ్ వచ్చిందా

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నుండి గురువారం మూడో పాటను విడుదల చేశారు. ‘రామా పోయి కృష్ణా వచ్చే.. బాధే పోయి హ్యాపీ వచ్చిందా..’ అంటూ సాగే పాటను హిప్ హాప్ తమిళ కంపోజ్ చేయగా, రామ్ మిర్యాల ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌గా పాడాడు. 

‘నైటే పోయి లైటే వచ్చే.. ప్రేమే పోతూ పోతూ.. ఏదో ఏదో నేర్పించిందా.. గోవిందా గోవిందా గర్ల్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్ గోవిందా.. అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా.. పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా.. వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా’ అంటూ హీరో లైఫ్‌‌‌‌‌‌‌‌ని బ్రేకప్ ప్రభావితం చేయలేదన్నట్టుగా లిరిక్స్ రాశారు చంద్రబోస్. 

కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్ సెట్‌‌‌‌‌‌‌‌లో చిత్రీకరించిన ఈ పాటలో హీరోహీరోయిన్స్ ఇద్దరూ సాధువుల తరహాలో కాషాయపు బట్టల్లో కనిపించారు.  శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అఖిల్ గ్రేస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 28న  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.