కార్ఖానా బాధితులకు ‘తూంకుంట’ తరహా పరిహారం ఇవ్వాలి : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

కార్ఖానా బాధితులకు  ‘తూంకుంట’ తరహా పరిహారం ఇవ్వాలి : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  •     సీఎంకు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు లేఖ

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ రహదారిపై ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సర్వం కోల్పోతున్న కార్ఖానా ప్రాంత బాధితులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు. సికింద్రాబాద్ కార్ఖానా ప్రాంతంలో రోడ్డు విస్తరణ వల్ల అనేక కుటుంబాలు తమ నివాసాలను, జీవనాధారమైన దుకాణాలను కోల్పోతున్నాయని పేర్కొన్నారు. 

ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించి బాధితులు అధికారులకు సహకరిస్తున్నారని కానీ, వారికి చెల్లించే పరిహారం మాత్రం ప్రస్తుత మార్కెట్ రేట్లకు ఏమాత్రం పొంతన లేకుండా ఉందని గుర్తుచేశారు. గతంలో తూంకుంట ప్రాంతంలో బాధితుల ఆస్తి విలువకు 10 రెట్ల పరిహారం అందించారని, కార్ఖానా బాధితుల విషయంలోనూ అదే పద్ధతి అమలు చేయాలని కోరారు. 

ఆవిష్కరణలకు ‘ప్రైవేట్’ ఊతం కావాలె

శాస్త్రీయ ఆవిష్కరణలకు  ప్రైవేట్ రంగం నుంచి భారీగా పెట్టుబడులు వచ్చినప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీపీ  సైన్స్ ఫండ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పాతబస్తీలో తిరంగా యాత్ర ప్రారంభం

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా దేశభక్తి వెల్లువెత్తుతోందని రాంచందర్ రావు అన్నారు. పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమైన తిరంగా యాత్రలో ఆయన పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు