మంచు మనోజ్ దంపతులకు గిఫ్ట్ పంపిన చరణ్ ఉపాసన.. అంత రేటా?

మంచు మనోజ్ దంపతులకు గిఫ్ట్ పంపిన చరణ్ ఉపాసన.. అంత రేటా?


మెగా హీరో రాంచరణ్(Ramcharan) పై మంచు హీరో చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాంచరణ్ ఉపాసన(Upasana) జంట మాల్దీవ్స్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మంచు వారింటికి ఈ కపుల్ ఓ గిఫ్ట్ పంపించారు. ఇటీవల భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడకకు రాలేకపోయిన చెర్రీ జంట లేట్ గా విషెస్ చెప్పారు. 

విషెస్ తో పాటుగా ఓ బ్యూటిఫుల్ గిఫ్ట్ ను పంపించారు. దాన్ని రిసీవ్ చేసుకున్న మనోజ్(Manchu manoj) తన సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు.  ‘‘థాంక్యూ సో మచ్ స్వీట్ కపుల్.  లవ్యూ మిత్రమా. మాల్దీవుల నుంచి రాగానే మిమ్మల్ని కలుస్తాను. మచ్ లవ్ ఫ్రమ్ ఎం అండ్ ఎం అంటూ పోస్ట్ చేశాడు. రాంచరణ్ పంపిన గిఫ్ట్ ను కూడా ట్విట్టర్ లో పంచుకున్నాడు. దీంతో అటు మెగా, మంచు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

గతంలో వీరిద్దరూ కలిసున్న ఫొటోలను కామెంట్లలో షేర్ చేస్తున్నారు. కొందరేమో ఈ వెడ్డింగ్ గిఫ్ట్ ధర చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆకాశంలో పెళ్లి చేసుకుంటున్న ఈ గిఫ్ట్ ధర రూ.70,500 అట. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో చెర్నీ నటిస్తున్న విషయం తెలిసిందే.